Telugu News

Telugu News In Telugu

Home » In Telugu » Andhra Pradesh State News » ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల
Search Search

ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల


విడిపోయిన తరువాత నూతనంగా ఏర్పడిన కొత్త ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిన్న పాత అసెంబ్లీ హాల్ లో శాసనసభ సమావేసాలకుగాను కొలువుతీరింది, అయితే మొదటగా ప్రోటెం స్పీకర్ గా ప్రమాణం చేసిన పతివాడ తదుపరి అంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసారు.

తరువాత వైఎస్ జగన్ మొదలుకొని 166మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారాలు చేసారు, మిగిలిన మరి కొంత మంది ముహూర్తం బాగోలేదని ఈ రోజు జరిగే సమావేశంలో ప్రమాణం చేసే అవకాసం వుందని తెలిసింది.

అయితే తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత అయిన కోడెల శివప్రసాద్ రావు పేరును అసెంబ్లీ స్పీకర్ గా సూచిస్తూ అధికార పార్టీ తెలుపగా అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా అంగీకారం తెలుపుతూ సంతకం కూడా చేసారని తెలిసింది.

మరో పక్క నిన్న స్పీకర్ పదవికి సంబంధించి కోడెల నుంచి తప్ప ఇంకా ఎవరి నుండి కూడా నామినేషన్ రాకపోయేసరికి ఏకగ్రీవం గా కోడెల శివప్రసాద్ అసెంబ్లీ స్పీకర్ అని అందరికీ తెలిసి పోయింది. అయితే ఈ రోజు అధికారికంగా ప్రకటన కూడా జరిగింది అని తెదేపా పార్టీ వర్గాలు తెలియజేసాయి. మరోపక్క డిప్యూటీ స్పీకర్ ఎవరూ అన్నదానిపై మాత్రం ఉత్కంట నెలకొంది.

కోడెల ప్రమాణం చేసిన పిదప ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ప్రతిపక్ష నేత కాగన్ అభినందనలు తెలియజేసారు.

తాజా తాజా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్తలు

» శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి
» తెలంగాణ సిటిజెన్ కార్డులు
» ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి
» ఒడిషా ను తాకిన రుతుపవనాలు
» రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు
» ఎవరి విద్యుత్ వారిదే
» ఇంకా దరిచేరని రుతుపవనాలు
» ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ
» మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం
» ఎండలతో పెరుగుతున్న విద్యుత్ సమస్య

Beauty Tips in Telugu
తాజా తాజా వార్తలు

Telugu Cinema, Telugu Movies