Latest Telugu news in Telugu Language
Telugu Movies
Andhra Recipes in Telugu
Beauty tips in Telugu
Ayurveda tips in Telugu

లోక్ సభలో యుద్ధ వాతావరణం

గురువారం జరిగిన లోక్ సభలో ఒక రకంగా యుద్ధ వాతావరణం నేలకొందనే చెప్పాలి, ఎందుకంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సరే తెలంగాణ బిల్లును పార్లమెంటు లో ప్రవేశ పెట్టి తీరాలన్న ఉద్దేశంతో వుండగా మరోపక్క సీమాంధ్ర ఎంపీ లు ఎలాగైనా సరే బిల్లును అడ్డుకోవాలని కృత నిశ్చయంతో వున్నారు.

అయితే సీమాంధ్ర ప్రాంత ఎంపీలు సభ మొదలవగానే ఒక్క సారిగా స్పీకర్ పోడియం ముందుకు వస్తుండగా వారిని కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఇతర రాష్ట్ర ఎంపీలు అడ్డుకోవడంతో ఒక రకమైన యుద్ధ వాతావరణమే నెలకొంది, అయితే ఈ క్రమంలో తన ప్రాణ రక్షణ కోసం విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తనతో తెచ్చుకున్న మిరియాల పొడి ని గాలిలోకి స్ప్రే చేయడంతో అంతా కూడా చెల్లచెదురై బయటకు పరుగులు తీసారు, ఈ క్రమంలో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టినట్లు కాంగ్రెస్ చెబుతున్నా మరో పక్క అన్ని ప్రతిపక్ష పార్టీలు అసలు తమకు తెలియనే లేదు ఎప్పుడు ప్రవేశ పెట్టారో నని గట్టిగా వాదిస్తున్నాయి.

ఈ క్రమంలో పలువురు ఎంపీలు అస్వస్థతకు గురి కావడం తో వారిని దగ్గర లోని ఆసుపత్రికి తరలించి కావలసిన శస్త్ర చికిత్స చేసారు. మరో పక్క తెలుగు దేశం పార్టీ కి చెందిన కొనకళ్ళ కు గుండె నెప్పి వచ్చి పడిపోయారు.

అందరూ కూడా బయటకు వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఒక పధకం ప్రకారమే ఇలా చేసిందని తెలియజేసారు.

మరో పక్క స్పీకర్ మీరా కుమార్ మాట్లాడుతూ ఈ రోజు మన లోక్ సభలో జరిగినది భారత దేశ చరిత్రలోనే ఒక దురదృష్ట కరమైన రోజని అభివర్ణించారు. ఇది ఇలా వుండగా స్పీకర్ 16 మంది ఎంపీలను ఈ సమావేశాలు జరిగినంత వరకు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
Beauty Tips in Telugu

Telugu news papers

Eenadu Telugu News PaperEenadu
Sakshi Telugu News PaperSakshi
Andhra Jyothi Telugu News PaperAndhra Jyothi
Vaartha Telugu News PaperVaartha
Andhra Bhoomi Telugu News PaperAndhra Bhoomi
Suryaa Telugu News PaperSuryaa
Andhra Prabha Telugu News PaperAndhra Prabha
Prajasakti Telugu News PaperPrajasakthi