Latest Telugu news in Telugu Language
Telugu Movies
Andhra Recipes in Telugu
Beauty tips in Telugu
Ayurveda tips in Telugu

డిసెంబర్‌ 4న వస్తున్న "మేము"

సూపర్‌స్టార్‌ సూర్య నటిస్తూ నిర్మిస్తున్న తమిళ చిత్రం "పసంగ 2" తెలుగులో "మేము" పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే. అమలాపాల్‌, బిందుమాధవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్శకుడు. ఇప్పటివరకు పాండిరాజ్‌ దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలు అసాధారణ విజయం సాధించి ఉండడానికి తోడు.. "పసంగ 2" చిత్రాన్ని ఆ చిత్ర కథానాయకుడు సూర్య నిర్మిస్తుండడంతో.. ఈ సినిమాకు గల క్రేజ్‌ రోజురోజుకూ పెరుగుతోంది.

ఈ చిత్రాన్ని తెలుగులో సాయిమణికంఠ క్రియేషన్స్‌ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి నిర్మిస్తుండగా.. సూర్య - కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా సంయుక్తంగా సమర్పిస్తున్నారు. ప్రసాద్‌ సన్నితి-తమటం కుమార్‌రెడ్డి సహ నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. అన్ని కార్యక్రమాూ శరవేగంగా పూర్తి చేసుకొంటున్న ఈ చిత్రాన్ని తెలుగు-తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 4న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా సాయిమణికంఠ క్రియేషన్స్‌ అధినేత-చిత్ర నిర్మాత జూలకంటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. - తమిళ - తెలుగు భాషల్లో కలిపి వంద కోట్లకు పైగా మార్కెట్‌ కలిగిన సూర్య నటిస్తూ.. తమిళంలో నిర్మిస్తున్న "పసంగ-2" చిత్రాన్ని "మేము" పేరుతో తెలుగు ప్రేక్షకుకు అందించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. సూర్య చేతుల మీదుగా విడుదలైన "మేము" ఆడియోకు చాలా మంచి స్పందన వస్తోంది. డిసెంబర్‌ 4న ఈ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. "మనం, దృశ్యం" చిత్రాల కోవలో "మేము" ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది అన్నారు.

"పిశాచి" ఫేం అరోల్‌ కొరెల్లి సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి పాటలు: వెన్నెలకంటి-చంద్రబోస్‌-సాహితి, సంభాషణలు: శశాంక్‌ వెన్నెలకంటి, సహ నిర్మాతలు: ప్రసాద్‌ సన్నితి-తమటం కుమార్‌రెడ్డి, సమర్పణ: సూర్య-కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్‌రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌!!
Beauty Tips in Telugu

Telugu news papers

Eenadu Telugu News PaperEenadu
Sakshi Telugu News PaperSakshi
Andhra Jyothi Telugu News PaperAndhra Jyothi
Vaartha Telugu News PaperVaartha
Andhra Bhoomi Telugu News PaperAndhra Bhoomi
Suryaa Telugu News PaperSuryaa
Andhra Prabha Telugu News PaperAndhra Prabha
Prajasakti Telugu News PaperPrajasakthi